Tuesday, May 14, 2024

ఉమెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌ టోర్నీ, క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌పై టీమిండియా కన్ను!

ఎఫ్‌ఐహెచ్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గురువారంనాడు పూల్‌-బీ గ్రూప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి, నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాలని భారత మహిళల హాకీ జట్టు ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది ఒలింపిక్స్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయాలు నమోదు చేసి, 4వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా గ్రూప్‌-బిలో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-1తో డ్రాగా ముగియగా, మంగళవారం వేజ్‌నర్‌ హాకీ స్టేడియంలో ఏసియన్‌ రైవల్స్‌ చైనాతో జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుతం రాణించింది. 1-1తో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో గురువారంనాడు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌పై సవిత టీమ్‌ దృష్టి కేంద్రీకరించింది.

పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న భారత జట్టు, అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై గెలిస్తే, నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. ఇంగ్లండ్‌పై 3-1తో గెలిచిన న్యూజిలాండ్‌ పూల్‌-బి గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత రెండేసి పాయింట్లతో చైనా, భారత్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టోర్నీలో మొత్తం 16 టీమ్‌లుండగా, నాలుగేసి జట్లను పూల్‌ ఏ, పూల్‌ బీ, పూల్‌ సీ, పూల్‌ డీ గ్రూపులుగా విడదీశారు. గ్రూప్‌ల వారీగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కి అర్హత పొందుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement