Wednesday, May 15, 2024

Khammam: కోనేరు చిన్ని చేరికతో బీఆర్ఎస్ కు మరింత బలం.. ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు

కొత్తగూడెం : బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కోనేరు సత్యనారాయణ (కోనేరు) బీఆర్ఎస్ పార్టీలో చేరికతో జిల్లాలో మరింత బలం పెరుగుతుందని ప్రభుత్వ విఫ్, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.

బుధవారం కొత్తగూడెంలోని కోనేరు చిన్ని స్వగృహానికి చేరుకొన్న రేగా కాంతారావు ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనేరు చిన్ని తండ్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరావుతో సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధం ఈ కలయికకు దారి తీసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement