Tuesday, April 30, 2024

‘రావణాసుర’తో.. రవితేజ హాట్రిక్ సాధిస్తాడా?

తన కెరీర్‌లో వరుస ఫ్లాప్ ల త‌ర్వాత‌, వరుసగా రెండు హిట్‌ సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గత ఏడాది రిలీజ అయి “ధమాకా”, ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యసినిమాలతో రెండు వరుస హిట్లు అందుకున్నాడు. కాగా, ఈ నెల (ఏప్రిల్) 7న రిలీజ్ కానున్న రావణాసుర సినిమాతో హాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ రోజు ట్విట్లర్ వేదికగా #AskRavanasara అంటూ తన అభిమానులతో ఎంగేజ్ అయ్యాడు రవితేజ. అందులో ఒక అభిమాని “మీరు వరుసగా మూడు విజయాలు సాధించగలరా” అని అడిగాడు.. “అదే మన ప్రయత్నం (అవును నేను అదే ప్రయత్నిస్తున్నాను)” అని బదులిచ్చారు రవితేజ. ఈ సినిమా కథ, తన పాత్రను రాసిన విధానం కారణంగా తాను “రావణాసుర”లో నటించడానికి ఒకే చెప్పానని తెలిపాడు. దర్శకుడు సుధీర్ వర్మ మంచి సాంకేతిక నిపుణుడని, అతని పనితనం అభినందనీయమని అభిమానులకు తెలిపాడు రవితేజ.

Advertisement

తాజా వార్తలు

Advertisement