Friday, May 3, 2024

వింటర్ ఈజ్ కమింగ్! చలి ఎఫెక్టతో తగ్గుతున్న విద్యుత్‌ డిమాండ్‌..

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌: ఓవైపు వర్షాలు కురుస్తునే ఉన్నాయి. మరోవైపు చలితీవ్రత పెరిగింది. నగరవాసులను చలి వణికిస్తుంది. 19 నుంచి 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు ఇళ్ళల్లో, కార్యాలయాల్లో ఫ్యాన్‌ లేనిదే ఉండలేని పరిస్థితి ఉన్నది. గత వారం వరకు నగరంలో ఎక్కడో ఒక చోట వర్షం పడుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా గత 3రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చింది, 19 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 15 డిగ్రీలక నిష్టానికి చేరుకుంది. దీనితో చలి తీవ్రత పెరిగింది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చలి పెరిగిన ప్రభావం విద్యుత్‌ డిమాండ్‌పై పడింది. గత నాలుగైదు రోజుల క్రితం వరకు గ్రేటర్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగం 55 మిలియన్‌ యూనిట్ల నుంచి 45 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది.
హైదరాబాద్‌ మహా నగరంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో నగర వాసులను చలి వణికిస్తుంది. దీని ప్రభావంతో గత నాలుగైదు రోజుల వరకు ఉక్కపోతతో ఫ్యాన్‌ లేనిదే ఉండలేని వారు ప్రస్తుతం ఫ్యాన్‌ను నడిపించక పోవడం, కార్యాలయాలలో ఏసీల వాడకం తగ్గిపోవడం, ఐటీ కారిడార్లలో కూడా ఏసీల వాడకం తగ్గిపోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా 20 నుంచి 25శాతం పడిపోయింది.

ఈ నెల 21 తేదీన హైదరాబాద్‌లో విద్యుత్‌ వినియోగం 55 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 25వ తేదీన అది 45 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. హైదరాబాద్‌ నగరంలో సాధారణ ఉష్ణోగ్రతలు 19 నుంచి 22 డిగ్రీలుగా ఉంటుంది. అయితే అది గత మూడు రోజులుగా 15 డిగ్రీల కనిష్టానికి పడిపోయింది. దీనితో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం తగ్గి పోవడంతో విద్యుత్‌ డిమాండ్‌ పడిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 53 లక్షలకు పైగా గృహా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పడిపోయింది. హైదరాబాద్‌ పరిసర జిల్లాలు మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీని ప్రభావం హైదరాబాద్‌ సిటిపై ఉన్నది. ఈ పరిస్థితి మరో నాలుగైదు రోజుల పాటు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పెర్కోంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement