Friday, May 17, 2024

యశోద ట్రైలర్ రిలీజ్..పలు భాషల్లో రిలీజ్ చేసిన స్టార్ హీరోస్

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది యశోద మూవీ. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రని పోషించింది. కాగా ఈ మూవీ యశోద ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి హరి-హరీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ లాంఛ్‌ చేశారు. పాన్‌ ఇండియా కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను హీరోలు రక్షిత్‌ శెట్టి, దుల్కర్‌ సల్మాన్, సూర్య, వరుణ్‌ ధవన్‌ లాంఛ్‌ చేశారు.ఈ ట్రైలర్ లో సమంత నటన హైలైట్ గా నిలిచింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement