Thursday, May 9, 2024

బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరు ? .. బండి సంజయ్

బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ నేతల్ని కేసీఆర్ పిలిపించుకొని జాయిన్ చేసుకున్నారన్నారు. వాళ్లను తీసుకొచ్చేందుకు వందకు పైగా కార్లను పంపించారన్నారు. గత ఎన్నికలకు ముందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాడని, ఆంధ్రా వాళ్లను తిట్టాడన్నారు. ఆంధ్రా బిర్యానీని పెండ బిర్యానీ అని తిట్టావు కదా అని అన్నారు. ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న కేసీఆర్ ఆర్టీసీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నావని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. పోలవరంపై కేసీఆర్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో మళ్లీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement