Friday, April 26, 2024

ఏపీ, తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు?

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో CBSE బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి ఏపీ, తెలంగాణలో స్టేట్ బోర్డులు పదో తరగతి పరీక్షలపై ఏ నిర్ణయం తీసుకోనున్నాయి? ఇదే అంశాన్ని ఇప్పుడు విద్యార్థులు చర్చించుకుంటున్నారు.

ఏపీ, తెలంగాణలో రోజుకు 3వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్టేట్ బోర్డులు కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకుండా పరీక్షలను రద్దు చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని రాజకీయ పక్షాలతో పాటు తల్లిదండ్రులు ప్రభుత్వాలను కోరుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు పదో తరగతి పరీక్షలను రద్దు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఆయా రాష్ట్రాల బోర్డులు ప్రకటన చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement