Monday, May 6, 2024

డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి కారకులెవరు? : అంబటి రాంబాబు..

పోలవరం, (ఏలూరు) ప్రభ న్యూస్‌: పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ఎవరు కారణమనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పరిపూర్ణమైన చర్చ జరగాలని తాము నిజాయితీగా కోరుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులతో మాట్లాడారు. ఆంధప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు లైఫ్‌ లైన్‌ లాంటిదని, అటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టుపై ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా ఉన్న అప్పటి తెలగుదేశం ప్రభుత్వంలోని జలవనరుల శాఖా మంత్రి హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి కారణం వారు కాదా అని ఆయన నిలదీశారు. కాఫర్‌ డ్యాం పూర్తికాకుండా డయాఫ్రం వాల్‌ పూర్తిచేయడం చరిత్రాత్మక తప్పిదమన్నారు.

దీనికి కారణమైన వారిని ప్రజలు క్షమించరని ఆయన వ్యాఖ్యానించారు. ముమ్మాటికీ డయాఫ్రం వాల్‌ నిర్మాణం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి అవగాహన రాహిత్యమేనని ఆయన పేర్కొన్నారు. కొన్ని వార్తా పత్రికలు, చానల్స్‌లో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతులు తీసుకుని నిర్మించారు కదా అని తనను ప్రశ్నిస్తున్నారని, అయితే అలా తీసుకుని ఉంటే అప్పటి ప్రభుత్వం తప్పిదం లేదా అని అడిగారు. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరలో పోలవరం పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. పనులు పురోగతిపై అధికారులతో సమీక్షించామన్నారు. ఏ మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి, పనులను వేగవంతంగా ఎంతవరకు ముందుకు తీసువెళ్లతామని అంశాలపై సమీక్షించామన్నారు. గత ప్రభుత్వం డయాఫ్రం వాల్‌ లోపాయిభూయిష్టంగా నిర్మించి సుమారు రూ. 400 కోట్లు వృధాతోపాటు ప్రాజెక్టును సమస్యల సుడిగుండంలోకి నెట్టివేసిందన్నారు. ఆ తప్పును ఎదువారిపై రుద్దేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారని విమర్శించారు.

ఈ విషయంలో మేధావులు నీటిపారుదల రంగం నిపుణులు చర్చించాలని కోరుకుంటు-న్నామన్నారు. డయాఫ్రం వాల్‌ కు మరమ్మత్తులు చేయాలా, పునర్మించాలా అనే విషయంపై ఇరిగేషన్‌ నిపుణులు నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 2018 లో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఎన్నికలకు వెళతామన్నారని అటు-వంటిది ఎందుకు ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు. అటువంటి వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టు-కుని ప్రాజెక్టు నిర్మాణం ఏ తేదీకి పూర్తవుతుందని అడుగుతున్నారన్నారు. ఏదేమైనప్పటికీ పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేయడం మాత్రం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమావేశంలో పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు తదితరులు పాల్గోన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement