Thursday, November 7, 2024

మండుటెండలో చల్లని కబురు!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండల వేడి, వడగాలుల తో అల్లాడుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు, రేపు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో నిన్న ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement