Tuesday, May 7, 2024

ఆయుధాలు.. ఆహారం పంపుతాం.. : బిడెన్‌

ఉక్రెయిన్‌కు ఆయుధాలు, ఆహారం, ధనం రూపంలో మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ చెప్పారు. యుద్ధంతో దెబ్బతిన్న ప్రాంతాల నుంచి ఉక్రేనియన్లు వలసలు వెళ్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఆపన్నహస్తం చాచింది. రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మరిన్ని ఆయుధాలు ఇస్తామని చెప్పారు. అక్కడి పౌరుల జీవితాలను రక్షించడానికి డబ్బు, ఆహారం కూడా సహాయంగా పంపుతామన్నారు.

ఉక్రేనియన్‌ శరణార్థులను స్వాగతిస్తామని ట్వీట్‌చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు 350 మిలియన్‌ డాలర్ల అదనపు సైనిక సామగ్రిని యూఎస్‌ అందించింది. ఇక ఉక్రెయిన్‌లో రసాయన దాడులు జరిగే ప్రమాదం ఉందంటూ నాటో ఆందోళన వ్యక్తంచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement