Sunday, April 28, 2024

సింగరేణిని కాపాడుకుంటాం.. మోడీకి గుణపాఠం చెప్తాం : రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఏరియా నందు కేంద్రం సింగరేణి సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్‌ కుట్ర ప‌న్నుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా BRS ఆధ్వర్యంలో మహాధర్నా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ తెలంగాణలో బొగ్గు బంగారమైన సింగరేణి సంస్థల‌పై బిజెపి ప్రభుత్వం కుటీల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతున్నదన్నారు. సింగరేణి పూర్తిగా ప్రవేటికరించి చేతులు దులుపుకోవాలని చూస్తుంద‌న్నారు. మరోసారి బొగ్గు బ్లాక్ ల వేలాన్ని వేయడానికి చూస్తుంద‌న్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వేయాల‌ని మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో మహా మహాధర్న కార్యక్రమం నిర్వహించడం జరిగింన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రంపై సింగరేణి కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నద‌ని, కేంద్రానికి కేవలం 49 శాతం మాత్రమే ఉన్నదని, అలాంటి పరిస్థితులలో తాము చేయడం వీలుకాదాన్ని చెప్పి నెల తిరగముందే ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement