Sunday, April 28, 2024

TS | పాలమూరుకు జాతీయ హోదా ఇస్తాం : రాహుల్ గాంధీ

అధికారంలోకి రాగానే మహిళల బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి రూ.లక్ష జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలోని నిరుద్యోగులు అందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇస్తామని.. దేశంలోని యువత అందరికీ ఏడాది పాటు అప్రంటీస్ ఇప్పిస్తామని పేర్కొన్నారు.

దేశంలోని నిరుద్యోగ యువత అందరికీ లక్ష రూపాయల జీతంతో ఏడాదిపాటు అప్రంటీస్ శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఏ కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు తక్కువ కాకుండా చూస్తామి ప్రకటించారు.

ఇక తెలంగాణ సంబంధి పలు హామీలు ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. పాలమూరుకు జాతీయ హోదా, మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement