Monday, April 29, 2024

ఆ సంప్రదాయినికి కట్టుబడి ఉన్నాం.. అయినా ఆత్మకూరులో టీడీపీ సత్తా చూపిస్తా: అచ్చెన్న‌

అమరావతి, ఆంధ్రప్రభ : శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆయా స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడద నే ఉత్తమ సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ పాటిస్తుందని ఆత్మకూరు ఉప ఎన్నికల అంశంలో కూడా ఇదే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉప ఎన్నికల్లో పోటీచేస్తే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని పాటిస్తున్నామని చెప్పారు. గతంలో దేవరకొండ, నంద్యాల, పులివెందుల ఉప ఎన్నికల్లో అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ తమ అభ్యర్థిని నిలపలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అయితే 2021లో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్‌ మరణించిన సమయంలో వారి కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు సీటు ఇవ్వడం వల్లే బరిలోకి దిగామని స్పష్టం చేశారు. ప్ర స్తుతం ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో మేకపాటి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నారని ఈ నేపథ్యంలో గత సాంప్రదాయాన్ని పాటిస్తూ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో మేకపాటి కుటుంబ సభ్యులు కాకుండా వేరే వారికి వైకాపా టికెట్‌ ఇస్తే తమ పార్టీ పోటీలో ఉండి సత్తా చాటుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఉప ఎన్నికల్లో వైకాపా విధానమేంటో ఆ పార్టీ అధినేత స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement