Saturday, May 4, 2024

కిర‌ణ్ అబ్బ‌వ‌రం చిత్రానికి క్లాప్ కొట్టిన.. వి.వి.వినాయ‌క్

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న తొమ్మిద‌వ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. విశ్వ‌క‌రుణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు ..ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టారు.నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో ఈ సినిమా షూటింగు లాంచనంగా మొదలైంది. కిరణ్ అబ్బవరం ఇలా వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుండటం విశేషమే. పెద్ద బ్యానర్లలో చేస్తుండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సక్సెస్ టాక్ తెచ్చుకున్న కొన్ని రోజులకే .. ‘మీటర్స‌ లైన్ లో ఉండగానే ఆయన ఈ సినిమాను పట్టాలెక్కించారు. శివమ్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement