Friday, May 10, 2024

కోరిక‌లు తీరాలంటే చీర క‌ట్టాల్సిందే….

ఆదోని రూరల్‌, ప్రభ న్యూస్‌ : కోరుకున్న కోరికలు తీరాలంటే చీర కట్టాల్సిందే అన్న నమ్మకం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కొల్లూరు గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా రతి మన్మధుల స్వాముల వారిని రథోత్సవాన్ని పూల మాలలు పచ్చని తోరణాలతో అలంకరించి స్వాముల వారిని ఆసినింపజేసి భాజా భజంత్రీలు డప్పు వాయిద్యాల మధ్య రథోత్సవం కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఆలయ అర్చకులు కుంకుమార్చన బిల్వర్చన ఆకు పూజ నైవేద్యం వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే పురుషులు మహిళల వేషధారణలో చీరను బంగారు ఆభరణాలు ధరించి దేవాలయానికి వెళ్లి భక్తి ప్రపత్తులతో వారు మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించుకున్నారు.

పెళ్లి చేసుకున్న దంపతులకు సంతానం కలగకపోతే రతిమన్మధులకు మొక్కుకుంటే సంతానం కలుగుతుంది అని గ్రామస్తులు భక్తాదుల నమ్మకం ఉంది అలా మొక్కుకున్న వారికి ఎంతోమందికి సంతా నం కూడా కలిగినట్లు- గ్రామస్తులు చెబుతు న్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రతి మన్మధు లకు మొక్కుకొని వారి కోరికలు తీర్చుకుంటు-న్నారు. సాగు చేసుకున్న పంటలను కూడా సక్రమంగా పండాలని మొక్కుకున్న వారికి కూడా పుష్కలంగా అధిక దిగుబడులు వస్తాయని రైతన్నలు నమ్మకం రెండవ రోజు గురువారం పురుషులు మహిళల వేషధారణలో కుంభోత్సవం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఇలా చేస్తే మొక్కుకున్న కోరికలు తీరుతాయని కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల్రకు చెందిన భక్తాదులు సైతం మొక్కుకున్న కోరికలు తీర్చేందుకు హోలీ సందర్భంగా గ్రామానికి వచ్చి స్వాముల వారికి సమర్పించుకుంటు-న్నారు. రతి మన్మధుల స్వాముల వారిని దర్శించుకు నేందుకు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజర య్యారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ఉండేందుకు తాలూకా సిఐ ఉమామహేశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో ఎస్సై విజయలక్ష్మి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement