Friday, May 17, 2024

ఆస‌క్తిరేకెత్తిస్తోన్న.. విరూపాక్ష టీజ‌ర్

విరూపాక్ష టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీనిని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’ అనే డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత హీరో సాయితేజ్ చేసిన ఈ సినిమా, ఆయనకి తప్పకుండా హిట్ తెచ్చి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement