Tuesday, April 30, 2024

చిక్కుల్లో విరాట్‌.. ఐపీఎల్‌లో మ‌రోసారి ఈ పొర‌పాటు జ‌రిగితే బ్యాన్‌!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిష‌న్ లో ఇప్పటివరకు మొత్తం 34మ్యాచ్‌లు జ‌రిగాయి. కాగా, ఈ మ్యాచ్ ల మధ్యలో విరాట్ కోహ్లీకి ఓ చిక్కు ఎదురైంది. కోహ్లీ గత రెండు మ్యాచ్‌లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టుకు కెప్టెన్సీ బాద్య‌త‌లు నిర్వ‌హించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే, బెంగళూరు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్న‌ కోహ్లీకి ఇక్క‌డే భారీ షాక్ తగిలింది. ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో IPL స్లో ఓవర్ రేట్ ఉల్లంఘించినందుకు కోహ్లీకి రూ.24 లక్షల జరిమానా విధించారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ కి స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఇది రెండోసారి. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ కెప్టెన్‌కు 24 లక్షలు, జట్టు సభ్యులకు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏదైతే అది) కోత విధించినట్లు వెల్లడించారు. అంతకుముందు ఫాఫ్ డుప్లెసీ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. మళ్లీ ఇదే పరిస్థితి రిపీట్ అయితే ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి ఒకటి, రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

కాగా, స్లో ఓవర్ రేట్ రూల్స్‌ ప్రకారం.. తొలిసారి స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రూ.12 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పొరపాటు రిపీట్ అయితే.. కెప్టెన్‌కు జరిమానా 24 లక్షలు, జట్టులోని మిగిలిన ఆటగాళ్లు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, ఇలాంటి పొర‌పాటు మూడోసారి జ‌రిగితే.. టీమ్ కెప్టెన్ 30 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ నిషేధం కూడా ఉంటుంది. అదే సమయంలో, జట్టులోని ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో మరోసారి RCB పొరపాటు చేస్తే ఒక్క మ్యాచ్‌ నిషేధం విధించే అవకాశం ఉంద‌ని క్రికెట్ అన‌లిస్టులు చెబుతున్నారు.

- Advertisement -

స్లో ఓవర్ రేటు అంటే ఏమిటి?

IPLలో ఒక ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు వేయడానికి 90నిమిషాల సమ‌యం ఉంటుంది. అన్ని జట్లు నిర్ణీత సమయంలో 20 ఓవర్లు బౌలింగ్ చేయాలి. మ్యాచ్ 20వ ఓవర్ 85వ నిమిషంలో ప్రారంభమైనా.. కెప్టెన్, జట్టుకు ఎలాంటి పెనాల్టి ఉండ‌దు. కానీ ఒక జట్టు 85 నిమిషాలలోపు 20వ ఓవర్‌ను ప్రారంభించలేకపోతే, అప్పుడు స్లో ఓవర్ రేట్ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement