Saturday, May 4, 2024

Viral Video – వ‌ర‌ద‌ల‌లో కొట్టు కొచ్చిన పాల ప్యాకెట్లు … క్ష‌ణాల‌లో మాయం చేసిన జ‌నం …

మ‌చిలీప‌ట్నం – బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు వ‌చ్చాయి.. మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయిన జ‌నం తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. క్షణాల‌లో ఆ పాల ప్యాకెట్ల‌ను మాయం చేశారు.. మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

అస‌లు విష‌యానికి వ‌స్తే సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. దీంతో పాల ప్యాకెట్లు కొట్టుకొచ్చాయి. వాటినే జ‌నాలు అందిన‌కాడికి ప‌ట్టుకుపోయారు..

https://twitter.com/KP_Aashish/status/1679450641708589059?s=20
Advertisement

తాజా వార్తలు

Advertisement