Tuesday, May 21, 2024

ఫైన‌ల్ గా ఓటీటీలో వ‌స్తున్న “విక్రమ్ వేద”.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

తమిళ్‌లో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘విక్రమ్ వేద’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాగా, ఇదే సినిమాని బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్‌లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్‌ను తెర‌కెక్కించిన‌ గాయత్రి – పుష్కర్.. హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైంది.

కాగా.. ‘విక్రమ్ వేద’ ఎప్పుడెప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుందా అని ప్రేక్షకులు చాలారోజులుగా ఎదురుచూస్తుండ‌గా.. ఈ మూవీ మే 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుంద‌ని జియో సినిమా అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్‌ను ప్రకటించేందుకు ఒక చిన్న గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. కాగా ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఈ శుక్రవారం నుంచి జియో సినిమాస్‌లో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement