Saturday, May 4, 2024

Vijayakanth | తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్‌ కన్నుమూత

చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్‌ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement