Saturday, May 18, 2024

విఘ్నేశ్ శివ‌న్..న‌య‌న‌తార‌ల పెళ్లి వేడుక‌ని షూట్ చేయ‌నున్న ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్

పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌..విఘ్నేశ్ శివ‌న్ లు..ఈ వేడుక‌ను ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.వీరి వివాహం ఈ నెల 9న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది.. వివాహానికి ముందుగా ప్రివ్యూ షూటింగ్ ఆదివారం జరిగింది. వివాహ దృశ్యాలతో వెడ్డింగ్ డాక్యుమెంటరీని గౌతమ్ మీనన్ రూపొందించనున్నారు. అనంతరం దీన్ని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేస్తారని సమాచారం. నయనతార, విఘ్నేశ్ పెళ్లి వేడుక ప్రసార హక్కులను ఇప్పటికే నెట్ ప్లిక్స్ కు విక్రయించారా అనేది స్పష్టం కాలేదు. వివాహ వేడుకను చిత్రీకరించి, అనంతరం దాన్నొక డాక్యుమెంటరీగా రూపొందించిన తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల చేస్తారట‌. పెళ్లి డాక్యుమెంటరీ ప్రసార హక్కులను విక్రయించడం ద్వారా వారికి పెద్ద మొత్తంలో సమకూరే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement