Thursday, May 2, 2024

ఇట్స్ షూటింగ్ టైం అంటోన్న న‌టుడు.. శ‌ర‌త్ కుమార్

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి హీరో బాల‌కృష్ణతో తెర‌కెక్కిస్తున్న చిత్రం ఎన్బీకే 108. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయడంలో సిద్ధ‌హ‌స్తుడు. కాబట్టి బాలయ్య 108 మూవీ వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన బాలయ్య 108 మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. శరత్ కుమార్ తో ఫోటోకి ఫోజిచ్చిన అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ అవుతుంది.కాగా వీరసింహారెడ్డి చిత్రంతో బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అనీల్ రావిపూడితో శ‌ర‌త్ కుమార్ దిగిన ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement