Monday, April 29, 2024

ఇలాంటి నీచుడికి ఉరి శిక్ష వేయాలి: వనమా రాఘవపై షర్మిల సంచలన కామెంట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవేంద్రపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు.

‘’ టీఆర్ఎస్ లీడ‌ర్ అరాచ‌కాల‌కు నిండు కుటుంబం బ‌లైంది. ఎన్నో క‌ల‌లు గ‌న్న త‌ల్లిదండ్రులు లోకాన్ని విడిచారు. బంగారు భ‌విష్య‌త్తు ఉన్న పసి పిల్ల‌లు అగ్నికి ఆహుత‌య్యారు. ఇలాంటి దుర్మార్గున్ని వ‌దిలిపెట్ట‌కూడ‌దు. త‌న తండ్రి ఎమ్మెల్యే వ‌న‌మా ప్రోద్బ‌లంతోనే ఇలాంటి దారుణాల‌కు ఒడిగట్టాడు. గతంలోనూ వనమా రాఘవ ఆగడాలకు వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భూకబ్జాలు, సెటిల్ మెంట్లతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. ఇలాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి. ఎమ్మెల్యే వ‌నమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి,రాజ‌కీయాల‌ నుంచి త‌ప్పుకోవాలి. రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలి ‘’ అని షర్మిల పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement