Wednesday, May 15, 2024

Big Story: డ్రగ్స్ పై రూట్‌ మార్చిన పోలీసులు.. ఇక వినియోగదారులపై ఫోకస్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీసులకు సవాల్‌ విసిరిన డ్రగ్స్ తో పాటు గంజాయి మాఫియాపై కొద్ది కాలంగా ఉక్కుపాదం పాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు డ్రగ్స్‌ మాఫియాను పట్టుకోవడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపడడం లాంటి చర్యలు చేపడుతూ కంట్రోల్‌లోకి తీసుకు వస్తున్నారు. ప్రధా నంగా గంజాయి అమ్మకాల సరఫరాను కనుగొని వారిపై ఉక్కుపాదం మోపారు. అయితే ఇది దేశంలోని కొన్ని రాష్ట్రాల నుంచి సరఫరా అవుతుండడంతో పెద్ద ఎత్తున దాడులు చేసి గంజాయి సాగును ధ్వంసం చేశారు. దీంతో ఇటివల గంజాయి స్లప తగ్గిపోయింది. కాని, డ్రగ్స్‌ సరఫరా దారుల మాఫియాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉండడం, విదేశాల నుండి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయి.

డ్రగ్స్‌ సరఫ రాను ఎంత కంట్రోల్‌ చేసినా కొత్త కొత్త మాఫియాలు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఇలా వారిపై ఎన్ని కేసులు పెట్టినా ప్రయోజనం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు డ్రగ్స్‌ అమ్మకమే కాదు వాటిని వినియోగించే వారిని ఈసారి టార్గెట్‌ చేయా లని నిర్ణయించారు. ముఖ్యంగా డిమాండ్‌ లేకుండా డ్రగ్స్‌ స్లప ఉండదనే సూత్రంతో ముం దుకు సాగేందుకు నిర్ణయించారు. ఇన్నాళ్లు డ్రగ్స్‌ అమ్మే వారిపై చర్యలు తీసుకుంటున్న పోలీ సులు అవి వినియోగిస్తున్న విద్యార్థులు, యువకులను చూసీచూడనట్లు వదిలేసు ్తన్నారు. ఇదే అదనుగా తీసు కుంటున్న డ్రగ్‌ వినియో గదారులు వాటిని అమ్మకాలపై కూడా ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ అలవాటు కాస్తా స్మగ్లర్లుగా మారుస్తుందనే అభిప్రా యానికి పోలీసులు వచ్చారు.

దీంతో డ్రగ్స్‌ వాడుతున్న యువకులు, విద్యార్థు లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. వారి భవిష్యత్‌పై ఇక ఆలోచన లేకుండా చట్టపరమైన కేసులు పెట్టాలని నిర్ణయించారు. డ్రగ్స్‌ మాఫియా ద్వారా కొనుగోలు చేస్తున్న వారిని కూడా కటకటాల పాలు చేయాలని నిర్ణయించారు. ముందుగా వినియో గదారులను కట్‌ చేస్తే సరఫరా దారులు వెనక్కి తగ్గుతారనే నమ్మకంతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టి నట్టు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మీడియాకు చెప్పారు. ఇన్నాళ్ళూ విద్యా ర్థుల భవిష్యత్‌ను ఎందుకు నాశనం చేయా లన్న ఉద్దేశ్యంతో డ్రగ్స్‌ వినియో గదా రుల పట్ల చూసీ చూడ నట్లుగా వ్యవ హరించామని, అయితే డ్రగ్స్‌ విని యాగించే వారి సంఖ్య పెరగ డంతో కొత్త కొత్త స్మగ్లర్లు డ్రగ్స్‌ విక్ర యా లకు పాల్పడుతున్నారని, ఫలి తం పోలీసులకు ఇబ్బం ది కరంగా మారిందని పేర్కొ న్నారు. ఇక నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులుం టాయని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement