Thursday, May 2, 2024

అనుమతి లేకుండా సిగ్నల్‌ జామింగ్‌ పరికరాలు వాడడం చట్టవిరుద్ధం : కేంద్రం..

హైదరాబాద్‌/ఆంధ్రప్రభ: సెల్యులార్‌ సిగ్నల్‌ జామర్‌, జిపియస్‌ బ్లాకర్‌ లేదా ఇతర సిగ్నల్‌ జామింగ్‌ పరికరాలని ఉపయోగించడం చట్టవిరుద్ధమని సోమవారం భారత కేంద్ర ప్రభుత్వాధికారులు అధికారికంగా తెలియజేశారు. ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం ప్రత్యేకంగా భారత కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లయితే తప్ప ఎటువంటి సిగ్నల్‌ జామింగ్‌ పరికరాలూ వాడకూడదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కేంద్రం నుండి అనుమతించబడినవి కాకుండా., భారతదేశంలో సిగ్నల్‌ జామింగ్‌ పరికరాలను ప్రచారం చేయడం, విక్రయించడం, పంపిణీ చేయడం, ఎగుమతి దిగుమతులు చేసుకోవడం చట్టవిరుద్ధమని కేంద్ర ప్రభుత్వాధికారులు పేర్కొన్నారు.

గతంలోనే డాట్‌ ఆదేశం..

దేశంలోని ఇక్ఖామర్స్‌ కంపెనీలు తమ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో వైర్‌లెస్‌ జామర్‌ వంటి పరికరాలను విక్రయించకుండా డాట్‌ (డిపార్ట్‌ మెంటాఫ్‌ టెలీ కమ్యూనికేషన్‌) గతంలో హెచ్చరించారు. భద్రత కారణాల దృష్ట్యా తాజాగా ఆ నిబంధనని మరింత కఠినంగా అమలు పరుస్తూ, అధికారికంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు ఝారీ చేసింది. వైర్‌లెస్‌ జామర్‌లు, బూస్టర్లు, రిపీటర్ల సరైన ఉపయోగంపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాట్‌ అధికారులు తెలిపారు. సిగ్నల్‌ బూస్టర్‌ లేదా రిపీటర్లకు సంబంధించిన లైసెన్స్‌ పొందిన టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు మాత్రమే ఇందుకు మినహాయింపునిస్తున్నట్లు వారు తెలిపారు. వారు కాకుండా సిగ్నల్‌ బూస్టర్‌ లేదా రిపీటర్‌ లైసెన్సు లేని ఇతర వ్యక్తులు, లేదా ప్రైవేటు సంస్థలు సిగ్నల్‌ జామింగ్‌ పరికరాలు వాడకూడదనీ., వాటిని కలిగి ఉండడం కూడా చట్టాన్ని అతిక్రమించినట్లుగా పరిగణిస్తామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి తమ వద్ద పరికరాలు ఉంచిన్లటతే, వైర్లెస్‌ టెలిగ్రఫీ చట్టం 1933, భారత టెలిగ్రాఫ్‌ చట్టం 1988 ప్రకారం అందుకు శిక్షార్హులవుతారని భారత సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జన్రల్‌ అయిన డాక్టర్‌ యస్‌పీ కొచ్చార్‌ స్పష్టం చేశారు. ఇది మొబైల్‌ యూజర్లకు మాత్రమే కాకుండా, ఎమర్జన్సీ ఫోన్‌ కాళ్ళకు సంబంధించి కూడా ఆటంకాన్నీ, అసౌకర్యాన్నీ కలిగిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement