Wednesday, May 15, 2024

జాతి వివక్షతను ఇకనైనా అంతం చేద్దాం: బైడెన్​

అమెరికలో జాతివివక్ష దాడులు జరగడం పట్ల ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై ఎన్నో ఏళ్లుగా మౌనం వహిస్తున్నారని, అది కూడా నేరంతో సమానమని, ఆ తప్పును ఇకనైనా చేయొద్దని పిలుపునిచ్చారు. ‘‘ఇలాంటి దాడులపై ఇకనైనా నోరు విప్పుదాం. జాతి వివక్షను అంతం చేద్దాం’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. కొవిడ్ 19 సమయంలో తూర్పు ఆసియా వాసులపై విద్వేష దాడులు పెరిగిపోయాయని బైడెన్ అన్నారు. దేశాన్ని ఎన్నో ఏళ్లుగా జాతి వివక్ష అనే మహమ్మారి పట్టి పీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని అంతం చేసే దిశగా అమెరికన్లు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ద్వేషానికి చోటు లేదని, దానిని పారదోలాలని అన్నారు.

జాతి విద్వేషాలను కట్టడి చేయడం కోసం ఇద్దరు ఏషియన్ అమెరికన్ నేతలు కాంగ్రెస్ లో కొవిడ్ 19 హేట్ క్రైమ్స్ బిల్లును ప్రతిపాదించారని గుర్తు చేశారు. వీలైనంత తొందరగా కాంగ్రెస్ ఆ బిల్లును పాస్ చేసి చట్టంగా మారిస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. బిల్లు ప్రకారం.. ఎవరిపైనైనా జాతి విద్వేష దాడులు జరిగితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలనే బాధ్యులను చేస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement