Sunday, May 5, 2024

UPDATE : ఇన్స్టాగ్రామ్ లో స‌రికొత్త ఫీచ‌ర్.. తప్పిపోయిన పిల్లలను కనుగొనడానికి ‘AMBER Alerts’

ప్ర‌ముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒక‌టైన‌ ఇన్‌స్టాగ్రామ్ త‌మ యాప్ లో AMBER Alerts అనే ఓ కొత్త ఫీచ‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ అప్ డేట్ ప్ర‌క‌టించింది. ఈ ఫీచ‌ర్ తో ప్రజలు తమ చుట్టు ప‌క్క‌ల‌ ప్రాంతంలో తప్పిపోయిన పిల్లల నోటీసులను చూడటానికి.. త‌ప్పిపోయిన పిల్ల‌లకు సంబంధించి నోటీసులు షేర్ చేసుకోవ‌డానికి వీలు కల్పిస్తుంది. ఇప్ప‌టికైతే ఈ ఫీచ‌ర్ కొన్ని దేశాల్లోనే అందుబాటులోకి వచ్చింది. మ‌రి కొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికా, తైవాన్, ఉక్రెయిన్, యూకే, యూఏఈ, యూఎస్ తో సహా 25 దేశాలలో పూర్తిగా అందుబాటులో ఉండనుంది. అయితే మొదటిసారిగా AMBER Alerts లాంటి ఒక ఫీచ‌ర్ ని ఇన్‌స్టాగ్రామ్‌కి తీసుకురావ‌డం జ‌రిగింద‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది ఆ కంపెనీ. యుఎస్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్, UKలోని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, మెక్సికోలోని అటార్నీ జనరల్ ఆఫీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ వంటి మెద‌లైప సంస్థల భాగస్వామ్యంతో ఈ ఫీచర్ అభివృద్ధి చేయబడినట్టు ఆ కంపెనీ తెలిపింది.

ఈ AMBER Alert అనే ఫీచ‌ర్ 2015 నుండి Facebookలో ఉంది.. దీంతో తప్పిపోయిన పిల్లలను క‌నుక్కొని.. త్వరగా గుర్తించడంలో అధికారులకు సహాయం చేయడంలో ఈ ఫీచ‌ర్ విజయవంతమైంది. మీరుగానీ ఎవ‌రైనా పిల్ల‌లు త‌ప్పిపోయిన ఎరియాలో ఉన్న‌ట్లయితే.. ఆ త‌ప్పిపోయిన వారిగురించిన వివ‌రాలు మీ Instagram ఫీడ్‌లో కనిపిస్తుంది. అయితే మీకు వ‌చ్చిన ఆ అలెర్ట్ లో త‌ప్పిపోయిన ప‌లానా పిల్లలకు సంబంధించిన‌ ఫోటో, వారి వివరాలు, వారు త‌ప్పిపోయిన‌/ అపహరణ జరిగిన ప్రదేశం వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఈ విషయాన్ని మరింత వ్యాప్తి చేయడానికి మీకు వ‌చ్చిన ఆ అలెర్ట్ ను మీ స్నేహితుల‌కి కూడా షేర్ చేసే అవ‌కాశం ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement