Saturday, April 27, 2024

బాల‌య్య ఫ్యాన్స్ కి పూన‌కాలే-అద‌ర‌గొడుతోన్న అన్ స్టాప‌బుల్ యాంథ‌మ్

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ షోతో అద‌ర‌గొట్టి మ‌రింత‌గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. కాగా ఇప్పుడు అన్ స్టాప‌బుల్ సీజన్ 2కు సంబంధించి తెలుగు ఓటీటీ ఆహా ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. అన్​స్టాపబుల్ యాంథమ్​ను విడుదల చేసింది. ఇది అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటను ర్యాపర్​ రోల్​రైడా ఆలపించగా, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్​ స్వరాలు సమకూర్చారు. 3.39 నిమిషాలు నిడివి ఉన్న ఈ సాంగ్​.. ‘ఏదైనా నేను దిగనంత వరకే, వన్స్​ ఐ స్టెప్​ ఇన్​ హిస్టరీ రిపీట్’ అంటూ బాలయ్య డైలాగ్​తో ప్రారంభమైంది. ‘తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగ్ వదిలితే మోగి పోద్ది బాడీ అంతా’ అంటూ ఆయన గత సినిమా పేర్లు, డైలాగ్​లు కలగలపి ఈ పాటను రూపొందించారు. వీడియోలో.. తొలి సీజన్​లో సెలబ్రిటీ కంటెస్టెంట్​లతో బాలయ్య సందడి చేసిన సన్నివేశాలు, మేకింగ్ వీడియోలను చూపించడం ఆకట్టుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement