Monday, April 29, 2024

రాష్ట్రాల విద్యుత్ అధికారుల‌తో-కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ భేటీ

రాష్ట్రాల విద్యుత్ అధికారుల‌తో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స‌మావేశం కానున్నారు. ఈ సమావేశంలో 7150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు. వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ కొరత, ఒత్తడి ఎదుర్కొంటున్న పవర్ ప్లాంట్లు, ఒప్పందాలపై గురించి చర్చించనున్నారు. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలలో ఉండే డిమాండ్ కన్నా14 శాతం అధిక డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 220 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. గుజరాత్ లో 10 శాతం, మహారాష్ట్రలో 16 శాతం, యూపీలో 25 శాతం, తమిళనాడులో 8 శాతం మేర విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఈ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, హర్యానా, బీహర్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ కోతలు కోనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ ను బట్టి 3-8 గంటలు విద్యుత్ కొోతలను అమలు చేస్తున్నారు.ప‌లు రాష్ట్రాల్లో విద్యుత్ కోత‌ల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement