Thursday, May 2, 2024

Big Breaking | త్వరలోనే ట్రాక్​పైకి హెరిటేజ్​ స్పెషల్​.. చెన్నై ఫ్యాక్టరీలో పరిశీలించిన కేంద్ర మంత్రి

వందేభారత్ రైళ్లను తయారు చేసే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవ్వాల (శనివారం) సందర్శించారు. చెన్నైలోని ఐసీఎఫ్‌లో వందే భారత్ రైలు తయారీని ఆయన పరిశీలించారు. త్వరలోనే ట్రాక్​పైకి హెరిటేజ్​ స్పెషల్​ రైళ్లను తీసుకురాబోతున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వందే భారత్ రైలుకు 25 అప్​డేట్స్​ చేశామని, రైల్వే మంత్రిత్వ శాఖ ఫీల్డ్ యూనిట్ నుండి తమకు అందుతున్న అన్ని ఇన్‌పుట్‌లను పొందుపరుస్తున్నామని చెప్పారు.

ఇక.. నారింజ, ముదురు బూడిద రంగులో మార్పు చేసిన ఎక్స్ ప్రెస్ రైలును ఆయన పరిశీలించిన వీడియో ఒకటి నెట్టింట షేర్​ అవుతోంది.  అంతకుముందు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను కూడా వైష్ణవ్ సమీక్షించారు. రైళ్లలో అన్ని ఎయిర్ కండిషన్డ్, ఎగ్జిక్యూటివ్ తరగతులలో అమలు చేస్తున్న రాయితీ చార్జీల గురించి కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ తగ్గింపు అనేది కొత్త విషయం కాదని, గతంలో చాలా సంవత్సరాలుగా అమలులో ఉందన్నారు.

అన్ని ఎగ్జిక్యూటివ్ తరగతులతో పాటు ఏసీ చైర్ కార్ల ధరలు 25 శాతం వరకు తగ్గుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కొత్త అమలు పథకంలో వందే భారత్ కూడా భాగంగా ఉండనుంది. ఇది కాకుండా.. అన్ని మార్గాల గుండా ప్రయాణించే రైలును త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రైళ్లకు ‘హెరిటేజ్ స్పెషల్’ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను నడపనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీనిని స్టీమ్ ఇంజన్ సహాయంతో తయారు చేయనున్నారు. వచ్చే నెలలో పర్యాటకులకు అందుబాటులోకి రాకముందే.. ఈ రైలు మొదట సుదీర్ఘ వారసత్వ మార్గాలలో నడిపి దాని పనితీరును పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement