Tuesday, May 7, 2024

కొత్త అల్లారం.. 15 నిమిషాల్లో శరీరంలో కరోనా గుర్తింపు

క‌రోనా వైర‌స్‌ గుర్తింపు ఇకపై మ‌రింత తేలిక కానుంది. క‌రోనా వైర‌స్‌ను త‌క్కువ స‌మ‌యంలో గుర్తించే అల్లారంను బ్రిటిష్ శాస్త్ర‌వేత్త‌లు క‌నిపెట్టారు. ఈ అలారంకు కొవిడ్ అల్లారం అని పేరు పెట్టారు. ఈ అలారం గ‌దిలో ఉండే వారిలో కరోనా పాజిటివ్‌తో బాధ‌ప‌డుతున్న‌వారిని కేవ‌లం 15 నిమిషాల్లో ఇట్టే గుర్తిస్తుంది. పెద్ద గ‌ది అయితే 30 నిమిషాల స‌మ‌యం తీసుకుంటుంద‌ని, ఇది ఆర్టీ-పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల‌ కంటే ఖచ్చితమైనదని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

ఈ అల్లారం అందుబాటులోకి వ‌స్తే కరోనా సోకిన వారి గురించి సమాచారం పొందేందుకు విమాన క్యాబిన్లు, తరగతి గదులు, సంరక్షణ కేంద్రాలు, గృహాలు, కార్యాలయాలలో ఈజీగా స్క్రీనింగ్ చేప‌ట్ట‌వ‌చ్చు. ఈ పరికరం పొగ అల్లారం కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ పరిశోధన ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం), డర్హామ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు. పరికరం ద్వారా ఫలితాల ఖచ్చితత్వ స్థాయి 98-100 శాతం వరకు ఉంటుందని పరీక్షల‌ సమయంలో శాస్త్రవేత్తలు నిరూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement