Wednesday, May 8, 2024

46 వేల అకౌంట్లను నిషేధించిన ట్వీట్టర్‌..

న్యూఢిల్లి : నిబంధనలు పాటించని 46 వేల ఖాతాలను నిషేధించినట్లు ట్వీట్టర్‌ ఇండియా తెలిపింది. మే నెలలో ఇలాంటి ఖాతాలను గుర్తించి రద్దు చేసినట్లు ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా చిన్నపిల్లల సెక్స్‌వల్‌ కంటెంట్‌ ఉన్నవి, నగ్న చిత్రాలు ఉన్న 43,656 అకౌంట్లను తొలగించామని పేర్కొంది. టెర్రరిజాన్ని ప్రోత్సహించేలా ఉన్న 2,870 అకౌంట్లను నిషేధించినట్లు తెలిపింది. ఈ తరహా ఖాతాలపై 2022 ఏప్రిల్‌ 26 నుంచి మే 25 వరకు 1698 ఫిర్యాదులు అందాయని ట్వీట్టర్‌ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల్లో ఆన్‌లైన్‌లో వేధింపుల కేసులు 1366, విధ్వేషాలకు సంబంధించి 111, తప్పుడు సమాచారం, మీడియా వక్రీకరణలపై 36, అడల్ట్‌ కంటెంట్‌ పై 28, ఊహాగానాలపై 25 ఫిర్యాదులు అందాయని వివరించింది.

అకౌంట్ల నిషేధంపై 115 ఫిర్యాదులు అందాయని, వీటిని పరిశీలించిన తరువాత ఏ ఒక్క అకౌంట్‌ను పునరుద్ధరించలేదని తెలిపింది. నిబంధనలకు లోబడి ట్వీట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవాలని కోరింది. 3,93,303 పదాలను తొలగించి గుగూల్ అభ్యంతకరమైన భాషను ఉపయోగించిన 3,93,303 పదాలను మే నెలలో తొలగించినట్లు గుగూల్‌ తెలిపింది. ప్రధానంగా చిన్నారులపై లైంగిక వేధింపులు, టెర్రరిజాన్ని ప్రేరేపించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించినట్లు గుగూల్‌ అధివారం నాడు విడుదల చేసిన నెలవారి నివేదికలో తెలిపింది. యూజర్ల ఫిర్యాదు మేరకు 62673 పదాలు, వ్యాఖ్యాలను తొలగించినట్లు తెలిపింది.

19 లక్షల అకౌంట్లు తొలగించిన వాట్స్‌యాప్‌..

మే నెలలో తప్పుడు సమాచారం ఉన్న 19 లక్షల బ్యాడ్‌ అకౌంట్లను తొలగించినట్లు వాట్స్‌యాప్‌ తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ఈ అకౌంట్లను తొలగించారు. ఏప్రిల్‌ నెలలో వాట్స్‌యాప్‌ 16.6 లక్షల అకౌంట్లను తొలగించింది.
మే నెలలో ఇలా అకౌంట్ల తొలగింపుపై యూజర్ల నుంచి 528 ఫిర్యాదులు వచ్చాయని, విచారించిన తరువాత 24 అకౌంట్లను పునరుద్ధరించినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో ఇలాంటి ఫిర్యాదులు 844 రాగా, వీటిలో 123 అకౌంట్లను మళ్లి యాక్టివేట్‌ చేశారు.
2021 కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు ప్రతి నెల ఇలాంటి నివేదికలను ప్రకటించాల్సి ఉంటుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement