Thursday, April 25, 2024

మే 20న టీఎస్‌ ఈసెట్‌ ఎంట్రెన్స్‌.. 25న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఈసెట్‌-2023, టీఎస్‌ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలయ్యాయి. మే 20న ఈసెట్‌, 25న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ షెడ్యూళ్లను విడుదల చేసింది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోం టీఎస్‌ ఈసెట్‌ను నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొ. డి.రవీందర్‌, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొ.శ్రీరాం వెంకటేష్‌ కలిసి విడుదల చేశారు. మార్చి 1వ తేదీన టీఎస్‌ ఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

- Advertisement -

మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో మే 8వ తేదీ వరకు గడువిచ్చారు. రూ.2,500తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి 12 వరకు ఎడిట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 20న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం టీఎస్‌ ఈసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.

మార్చి 2 నుంచి లాసెట్‌ దరఖాస్తులు…

మార్చి 1వ తేదీన టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600గా, ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.900గా నిర్ధారించించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 12 వరకు, రూ.వెయ్యితో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్‌ చేసుకునేందుకు మే 5 నుంచి 10 వరకు అవకాశం కల్పించగా, మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 25న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. లాసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ బి.విజయలక్ష్మీ కలిసి మాసాబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement