Tuesday, April 30, 2024

వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు 17 స్థానాలకు టీఆర్ఎస్ తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. పరకాల నియోజకవర్గ పరిధిలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని4స్థానాలకు, పచ్చిమ నియోజకవర్గం పరిధిలోని 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అలాగే వర్ధన్నపేట పరిధిలోని 5 వార్డులకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.

వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ అభ్యర్థిగా సురేశ్ జోషి, 23 డివిజన్ యెలుగం లీలావతి సత్యనారాయణ, 27 డివిజన్ జారతి రమేశ్, 38 డివిజన్ బైరబోయిన ఉమాదామోదర్, పరకాల నియోజకవర్గ పరిధిలో 15వ డివిజన్ అభ్యర్థిగా ఆకులపల్లి మనోహర్, 16 డివిజన్ సుంకరి మనీష శివకుమార్, 17 డివిజన్ గడ్డె బాబు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్ అభ్యర్థిగా తాడిశెట్టి విద్యాసాగర్, 7వ డివిజన్ వేముల శ్రీనివాస్, 29వ డివిజన్ గుండు సుధారాణి, 51వ డివిజన్ బోయినపల్లి రంజిత్ రావు, 57వ డివిజన్ అభ్యర్థిగా నల్ల స్వరూపరాణిని టీఆర్ఎస్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement