Monday, May 6, 2024

 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో 28.13 లక్షల ఓటర్లుండగా, అందులో మహిళలు 13.53 లక్షలు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3337 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement