Monday, May 6, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 31
31.
పవన: పవతామస్మి
రామ: శస్త్రభృతామహమ్‌ |
ఝషాణాం మకరశ్చాస్మి
స్తోతసామస్మి జాహ్నవీ ||

తాత్పర్యము : నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జల జంతువులలో మకరమును, నదులలో గంగా నదిని అయి యున్నాను.

భాష్యము : చేపలలో మకరము మిక్కలి పెద్ది. అది మనిషికి అత్యంత హానికరమైనది. కాబట్టి అది శ్రీకృష్ణున్ని సూచిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement