Sunday, May 5, 2024

అహం రీబూట్ నుంచి ట్రైల‌ర్ రిలీజ్.. ఫుల్​ ఇంట్రెస్ట్ క‌లిగిస్తున్న వీడియో

ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ నటిస్తున్న సినిమా “అహం రీబూట్​’’ ఇది సైకలాజికల్ థ్రిల్లర్ గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాని రఘువీర్ గొరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రఫీ అందించిన ఈ మవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందింస్తున్నారు.

అయితే ఇవ్వాల (మంగ‌ళ‌వారం) కొద్ది సేప‌టి క్రితం ఈ సినిమా నుంచి “అహం రీబూట్ ఫస్ట్ గ్లిచ్” అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది మూవీ టీమ్.. రిలీజ్ అయిన వీడియో ప్ర‌కారం ఈ సినిమాలో సుమంత్ రేడియో జాకీ ‘నిల‌య్’ గా వ‌ర్క్‌ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్ జేగా త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుంటుండ‌గా ఓ అప‌రిచిత యువ‌తి కాల్ రేడియో జాకీకి క‌నెక్ట్ అవుతుంది..

‘ఐ యామ్ కిడ్నాప్డ్, ప్లీజ్ డోంట్ డిస్ క‌నెక్ట‌ది కాల్’ అని ఆమే చెప్పే మాట‌లతో స‌స్పెన్స్ గా సాగుతుంది వీడియో.. అసలు ఆమెను ఎవ‌రు, ఎలా, ఎందుకు కిడ్నాప్ చేశారన్నది ట్విస్ట్​గా మారుతుంది. ఈ ప్రశ్నలను అందరిలో మరింత క్యూరియాసిటీని కలిగిస్తాయని మేకర్స్​ వీడియోను అక్కడికే వదిలేశారు. మీరూ చూసి ఎంజాయ్​ చేయండి..

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement