Friday, May 3, 2024

కోలీవుడ్ లోవిషాదం – న‌టుడు రాము రోజ్ క‌న్నుమూత‌

కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు రాము రోజ్ క‌న్నుమూశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు నేడు జ‌ర‌గ‌నున్నాయి.ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు . స్టార్ హీరో సూర్యకి తండ్రి పాత్ర‌లో మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు సినిమాల‌కు సైన్ కూడా చేశార‌ట‌. గుండెపోటు రావ‌డంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిట‌ల్‌లో కుటుంబ స‌భ్యులు చేర్పించారు. అప్ప‌టి నుండి చికిత్స పొందుతూ ఉన్నారు. కాగా ఆయ‌న తుదిశ్వాస విడిచారు.ఆయ‌న మ‌ర‌ణ వార్త విన్న ప‌లువురు కోలీవుడ్ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు. ఈయ‌న మ‌ర‌ణ‌వార్త విన్న సీ.ఎం స్టాలిన్.. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతూ స్ట్రీట్ అర్టిస్టు నుండి గొప్ప న‌టుడిగా ఎదికి రామురోజ్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యార‌ని అన్నారు. ఉద‌యనిధి స్టాలిన్ హాస్పిట‌ల్‌కు వెళ్ళి నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement