Sunday, April 28, 2024

Tractor: బావిలో ప‌డ్డ ట్రాక్ట‌ర్… 30అడుగుల లోతులో చిన్నారి

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్‌పైకి ఎక్కి చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా ట్రాక్టర్‌ 30 అడుగుల లోతున్న బావిలో పడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా దెబ్బతినగా.. చిన్నారి శరీరంపై చిన్న గాయం కూడా లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన శివపురి జిల్లా కరైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని లంగూరి గ్రామంలో చోటుచేసుకుంది.నవాబ్‌కు అన్షుల్, సుహాని(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ నిలిపి ఉన్న ట్రాక్టర్‌పైకి ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా గేర్ ఊడిపోవడంతో ట్రాక్టర్ వాలుపైకి వెళ్లడం ప్రారంభించింది. గమనించిన నవాబ్ కుటుంబీకులు వెంటనే సుహానిని రక్షించగలిగారు. అన్షుల్‌ను రక్షించేలోపు ట్రాక్టర్‌ పక్కనే ఉన్న 30 అడుగుల లోతున్న బావిలో చిన్నారితో సహా పడిపోయింది. ఈ ఘటనలో అన్షుల్ మరణించి ఉంటాడని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ బావిలో పిల్లాడు సురక్షితంగా ఉండటం చూపి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement