Friday, April 26, 2024

రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయిస్తున్నారు: రేవంత్‌రెడ్డి

తెలంగాణకు వారసత్వ సంపదను సీఎం కేసీఆర్ అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి మండిపడ్డారు. బంగారం కంటే విలువైన భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ఆయన విమర్శించారు. కోకాపేట, నార్సంగిలో పేదలకు కేటాయించిన భూములను అమ్మడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఉమ్మడి ఏపీలో వివిధ ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తే… అప్పుడు కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్ చెప్పారు.

భూములు అమ్మడానికి అప్పటి సీమాంధ్ర ముఖ్యమంత్రులు భయపడ్డారని అన్నారు. ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన విలువైన భూములను ఇప్పుడు కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శ్రీచైతన్య కంపెనీ, ప్రిస్టేజ్ ఎస్టేట్ కూడా 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయని రేవంత్ చెప్పారు. భూముల అమ్మకాల్లో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలకు వివరణ ఇస్తారని తాము ఆశించామని… కానీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు పెంపు

Advertisement

తాజా వార్తలు

Advertisement