Monday, May 6, 2024

మహిళల డబుల్స్‌ విజేత.. క్రెజికోవా జోడీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌ ట్రోఫీని చెక్‌ రిపబ్లిక్‌ జోడీ టాప్‌సీడ్‌ బార్బోరా క్రెజికోవా-కత్రీనా సినికోవా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కజికిస్థాన్‌కు చెందిన అన్నా డినిలీనా, బ్రెజిల్‌కు చెందిన బియాట్రిజ్‌ హద్దాద్‌ మయ్యాపై 6-7, (3-7), 6-4, 6-4తేడాతో విజయం సాధించింది. క్రెజికోవా జోడీకి ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌..2గంటల 42నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చెక్‌జోడీ అంత సులభంగా విజయం సాధించలేదు.

కజకిస్థాన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో హోరాహోరీగా తలపడి చివరకు పైచేయి సాధించి టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. 2016లో జతకట్టిన ఈ జోడీ 2018, 2021లో ఫ్రెంచ్‌ఓపెన్‌తోపాటు 2018లో వింబుల్డన్‌ విజేతలుగా నిలిచారు. ఆదివారం ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకోవడంతో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ వారి సొంతమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement