Sunday, May 26, 2024

రేపు తెలంగాణ ఇరిగేషన్ డే.. విద్యాసాగర్ రావు స్మరణలో వేడుకలు..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): సాగునీటిరంగ నిపుణులు దివంగత ఆర్‌.విద్యాసాగర్‌రావు 82వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ‘5వ తెలంగాణ ఇరిగేషన్‌ డే’ ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ అసోసియెషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఈ వేడుకలను నిర్వ‌హించబోతున్న‌ట్టు తెలిపారు.

5వ తెలంగాణ ఇరిగేషన్‌ డేను పురస్కరించుకుని ఆరోజున కాళేశ్వరం, గోదావరి టు కావేరి నది అనుసంధానంపై రెండు సెమినార్లు ఉంటాయన్నారు. అదే సమయంలో ముగ్గురు ప్రముఖ ఇంజనీర్లు సుధాకర్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, నీలిమను సన్మానించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ వాటర్‌ రిసోర్స్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ వీ.ప్రకాష్‌రావు, వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరికిషోర్‌, సీఎం ఓస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ముఖ్య అతిథులుగా హాజరువుతున్నారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement