Wednesday, May 15, 2024

WC Final’s | నేడే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌… అజేయ భారత్‌తో ఆసీస్‌ పోరాటం

నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్‌ పండుగ ముంగిపు దశకు చేరింది. ట్రోఫీ కోసం ఇవ్వాల‌ (ఆదివారం) జరిగే ఫైనల్‌ పోరులో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్‌ కొమ్ములు వంచి… మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు.

క్రికెట్‌ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది. ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌. ఇరుజట్లకు ఇది రెండో టైటిల్‌ పోరు. 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్‌ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్‌ ఫేవరెట్‌.

- Advertisement -

రోహిత్‌ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోడీ, ఆసీస్‌ ఉప ప్రధాని రిచర్డ్‌ మార్ల్స్ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. మైదానంలోని 1.30లక్షల మంది ప్రేక్షకులతోపాటు, కోట్లాది క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎయిర్‌ షో, డ్రింక్స్‌.. ఇన్నింగ్స్‌ మధ్యలో సంగీత విభావరి, చివరగా లేజర్‌ షో ప్రదర్శించనున్నారు.

ఇటు అజేయం.. అటు అనుభవం

భారత్‌ 10 వరుస విజయాలతో అజేయంగా ఉంది. కానీ ఆస్ట్రేలియాకు అత్యధిక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడిన అనుభవం ఉంది. కంగారూలు ఆరో టైటిల్‌ విజయంపై కన్నేశారు. ప్రారంభంలో రెండు మ్యాచ్‌లు (భారత్‌, ద.ఆఫ్రికా) ఓడినా, ఆ తర్వాత వరుస గెలుపులతో ఆసీస్‌ అనూహ్యంగా దూసుకొచ్చింది. ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ మూడోసారి ప్రతిష్టాత్మక ట్రోఫీని అందుకోవాలంటే, షమీ మళ్లి తన పేస్‌ మ్యాజిక్‌ ప్రదర్శించాలి. కుడిచేతి వాటం పేసర్‌ ఎడమచేతి బ్యాటర్లకు ప్రమాదకారిగా ఉన్నాడు. డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్ హెడ్‌లను హడలెత్తిస్తున్నాడు.

ఒకవేళ భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే, ఓపెనింగ్‌లో రోహిత్‌శర్మ విజృంభణ, ఆ తర్వాత కోహ్లీ క్లాస్‌, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ సమయోచిత మెరుపు బ్యాటింగ్‌ ఫార్ములా మరోసారి సక్సెస్‌ అవ్వాలి. అప్పుడే టీమిండియా భారీ స్కోరు సాధ్యమవుతుంది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ చేస్తే, షమీ, జస్ప్రీత్‌ బుమ్రా పేస్‌ఎటాక్‌కు తోడు జడేజా, కుల్దిప్‌ స్పిన్నింగ్‌ వ్యూహం కచ్చితంగా అమలవ్వాలి. ఈ ఫైనల్‌ గెలిస్తే సొంతగడ్డపై రెండు ప్రపంచకప్‌ టైటిల్స్‌ గెలిచిన ఏకైక జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పుతుంది.

ఆస్ట్రేలియా బలాబలాలు..

టోర్నమెంట్‌లో తమ భయంకరమైన అత్యుత్తమ ఫామ్‌కి తిరిగి రావడానికి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్‌ ప్రధాన బలాల్లో ఒకటి. ట్రావిస్ హెడ్‌ (చేయి విరగడం వల్ల మొదట్లో టోర్నీకి దూరమయ్యాడు), మిచెల్‌ మార్ష్‌ (426 పరుగులు), డేవిడ్‌ వార్నర్‌ (528 పరుగులు) లేదా గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (398 పరుగులు), స్టీవ్‌ స్మిత్‌ లేదా మార్నస్‌ లాబుస్‌చాగ్నే, అందరూ బ్యాటింగ్‌లో సహకరించారు. లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 22 వికెట్లతో టాప్‌ ఫామ్‌లో మాక్స్‌వెల్‌, హెడ్‌ల పార్ట్‌టైమ్‌ ఆఫ్‌-స్పిన్‌తో జట్టుకు ప్రయోజనకరంగా ఉన్నారు.

సెమీస్‌లో పేసర్లు జోష్‌ హాజెల్‌వుడ్‌ (2/12), మిచ్‌ స్టార్క్‌ (3/34), కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ (3/54)ల ప్రదర్శనలు ఫైనల్‌ వేళ వారికి సానుకూలం. ఇక లీగ్‌దశలో చెన్నైలో కుల్దిdప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ల స్పిన్‌ త్రయం ఆరు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై ఆస్ట్రేలియా భరతం పట్టారు. కుల్దిప్‌, జడేజాలు టాప్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు, పేస్‌దళంలో షమీ నిప్పులు చెరుగుతుండగా, ప్రత్యర్థి గుండెల్లో బుమ్రా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తుండటం ఈ మ్యాచ్‌లో ఆసీస్‌కి నిజమైన సవాల్‌. భారత బౌలర్లను ఎదుకోవడంలో కంగారూల బలహీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

జట్లు:

భారత్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దిప్‌ యాదవ్‌, షమి, సూర్యకుమార్‌ యాదవ్‌, అశ్విన్‌, ఇషాన్‌ కిషన్‌.

ఆస్ట్రేలియా: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిష్‌, సీన్‌ అబాట్‌, కామెరాన్‌ గ్రీన్‌, హేజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఆడం జంపా, మిచెల్‌ స్టార్క్‌. లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌,

Advertisement

తాజా వార్తలు

Advertisement