Sunday, April 28, 2024

100 వికెట్ల మైలురాయికి.. వికెట్‌ దూరంలో చాహల్‌

టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 100వికెట్లు మైలురాయికి వికెట్‌ దూరంలో ఉన్నాడు. 6నుంచి వెస్టిండీస్‌తో జరిగిన పరిమత ఓవర్ల సిరీస్‌లో చాహల్‌ ఒక వికెట్‌ తీసినా వంద వికెట్ల బౌలర్ల క్లబ్‌లో చేరతాడు. ఈ క్లబ్‌లో 23మంది భారత బౌలర్లు ఉండగా స్పిన్‌ దిగ్గజం కుంబ్లే 269మ్యాచ్‌ల్లో 334 వన్డే వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

31ఏళ్ల చాహల్‌ ఇప్పటివరకు 59మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 99వికెట్లు పడగొట్టాడు. 42పరుగులుకు 6వికెట్లు చాహల్‌ అత్యుత్తమ ప్రదర్శన.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement