Wednesday, May 1, 2024

అసోంలో భారీ భూకంపం

అసోంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మొదట రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. భూపంక కేంద్రాన్ని తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది..అయితే భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement