Sunday, April 28, 2024

ఫ్రాన్స్ నుంచి నేరుగా ఇండియాకు రాఫెల్ జెట్లు..

భారత రక్షణ రంగంలోకి మరో మూడు రాఫెల్ జెట్లు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ లోని దస్సాల్ట్ ఏవియేషన్ నుంచి మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు ఇండియాకు చేరాయి. ఇవి ఫ్రాన్స్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి మధ్యలో ఎక్కడా ఆగకుండా ఇండియాకు చేరాయి. మార్గమధ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ట్యాంకర్ విమానాలు వీటికి అవసరమైన ఇంధనాన్ని గాల్లేనే నింపాయి. ఈ విషయాన్ని భారత వాయుసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మూడు విమానాలు వచ్చి చేరడంతో వాయుసేన వద్ద ఉన్న మొత్తం రాఫెల్ విమానాల సంఖ్య 14కు చేరింది. ఈ నెలాఖరులోగా మరో ఐదు విమానాలు డెలివరీ కానున్నాయి. వీటి చేరికతో వాయుసేన బలం మరింతగా పెరగనుందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement