Thursday, May 9, 2024

నెలరోజుల్లో 500 మంది చిన్నారులకు కరోనా

చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో నెల రోజుల్లోనే 500 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. బుధవారం ఒక్కరోజే నగరంలో 2 వేల మందికి కరోనా వైరస్ సోకగా అందులో 10 ఏళ్ల లోపు పిల్లలు 50 మంది ఉన్నారు. మార్చి 1 నుంచి 32 వేల మంది స్కూల్ పిల్లలకు కరోనా టెస్టులు చేశారు. కరోనా విజృంభిస్తున్నా స్కూళ్లు మూసివేసే ప్రసక్తే లేదని, పరీక్షలు ఉంటాయని సీఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు.

కాగా బుధవారం మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాజీ ప్రధాని దేవేగౌడ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ సతీమణి చెన్నమ్మ హోమ్ క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయన ఇంకా ప్రజాసేవ చెయ్యాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కర్ణాటక సీఎం యడ్యూరప్ప ట్వీట్ చేశారు. కాగా తాజా పరిణామాలతో ఐటీ హబ్ బెంగళూరులో ఏ రేంజ్‌లో కరోనా వైరస్ తాండవం చేస్తుందో అర్థం అవుతోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement