Saturday, May 4, 2024

కాల్పుల మోత.. ముగ్గురు మృతి

ఐరోపా దేశం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌ కాల్పుల మోతమోగింది. ఫీల్డ్స్‌ ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఆగంతకుడు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. దీంతో స్థానికులు భయాందోళనకు గరయ్యారు.

అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాపింగ్ మాల్‌ను చుట్టుముట్టారు. నిన్న సాయంత్రం 5.37 గంటల సమయంలో మాల్‌లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం 11 నిమిషాల్లోనే 22 ఏండ్ల వయస్సు కలగిన అనుమానితుడిని అరెస్టు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement