Saturday, June 3, 2023

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

అల్లూరి జిల్లా చింతూరు మండలంలోని ఇర్కంపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పురుటి నొప్పులతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరిన గర్భిణి కమల పరిస్థితి విష‌మించ‌డంతో.. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. వైద్యం చేస్తున్న క్ర‌మంలోనే శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ విష‌యం తెలిసిన‌ భర్త ఐతయ్య గుండెపోటుతో మృతి చెంద‌గా.. కొద్దిసేపటికే భర్త మృతి చెందిన విషయం తెలిసి భార్య కమల(27) మృతి చెందింది. వీరికి నలుగురు ఆడపిల్లలు ఉన్నార‌ని, ప్రభుత్వ‌మే చాన్నారుల‌ను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement