Saturday, April 20, 2024

ఆస‌క్తిక‌రంగా.. అమిగోస్ మూవీ టీజ‌ర్

అమిగోస్ చిత్రం నుండి టీజ‌ర్ రిలీజ్ అయింది.ఈ చిత్రంలో హీరోగా క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్‌ నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి క్రియేట్‌ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం..అందులో ఒకరు ఇన్నోసెంట్‌గా, మరొకరు స్టైలిష్‌గా, ఇంకొకరు నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా టీజర్‌లో కనిపించారు. మనం కలవడం ఓ అద్భుతం.. విడిపోవడం అవసరం అంటూ కళ్యాణ్‌ రామ్‌ డైలాగ్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యాక్షన్‌ స్టంట్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నాయి. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం ఆసక్తి రేకెత్తిస్తుంది. టీజర్‌తోనే మేకర్స్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. కళ్యాణ్‌రామ్‌కు ఈ సినిమా కూడా బింబిసార స్థాయిలో విజయాన్నిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్‌ కాబోతుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement